గుజరాత్ లోని సూరత్ కు చెందిన వజ్రాల వ్యాపారి కను అసోదరియా వద్ద సహజంగా లభించిన వజ్ర వినాయక విగ్రహం ఉంది. 12 ఏళ్ల క్రితం బెల్జియం నుంచి తీసుకొచ్చిన ఈ వజ్రం కోహినూర్ వజ్రం (105 క్యారెట్లు) కంటే పెద్దది. ఇది 182.3 క్యారెట్లు, 36.5 గ్రాముల బరువు ఉంది. మార్కెట్లో దీని ధర రూ.600 కోట్లకు పైగా ఉంటుందని చెబుతున్నారు. అయితే ఈ వజ్రపు విగ్రహాన్ని ఏడాదికి ఒకసారి వినాయక చవితి రోజున మాత్రమే పూజించడంతో భక్తులకు దర్శించుకునే భాగ్యం కల్పిస్తున్నారు.