ఆస్తుల వివరాలను వెల్లడించిన రెజ్లర్ వినేశ్ ఫోగాట్

50చూసినవారు
ఆస్తుల వివరాలను వెల్లడించిన రెజ్లర్ వినేశ్ ఫోగాట్
స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ హర్యానాలోని జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు వెల్లడించారు. తన చేతిలో రూ.1.95 లక్షల నగదు ఉందని, అలాగే వోల్వో ఎక్స్ సీ60 (రూ.35 లక్షలు), హ్యుండాయ్ క్రెటా (రూ.12 లక్షలు), టయోటా ఇన్నోవా (రూ.17 లక్షలు) కార్లు ఒక్కోటి చొప్పున ఉన్నట్లు చెప్పారు. వాటితో పాటు రూ. 2.24 లక్షల విలువైన 35 గ్రాముల బంగారం ఉందని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్