నేషనల్ క్రైమ్ బ్యూరో రిపోర్టు ప్రకారం మహిళలపై 2016లో 3,38,954, 2017లో 3,67,000, 2018లో 3,92,136 నేరాలు జరిగాయి. 2019లో 4,12,000, 2020లో 3,71,503, 2021లో 4,28,278, 2022లో 4,45,256 నేరాలు జరిగాయి. ఇవన్నీ పోలీసు స్టేషన్లలో రిజిస్టరైన కేసుల వివరాలు. 2016-2021 సంవత్సరాల మధ్య మహిళలపై నేరాలు 26.35 శాతం పెరిగాయి. 2021-2022 సంవత్సరాల్లో అత్యాచారాలు 7.1 శాతం పెరిగాయని ఈ రిపోర్టు తెలిపింది. గృహ హింస, కిడ్నాప్‌లు, దాడులు ఏటా పెరుగుతూనే వున్నాయి.