రోటీలు అమ్ముతున్న పదేళ్ల కుర్రాడు.. ఆనంద్ మహేంద్ర సపోర్ట్

78చూసినవారు
రోటీలు అమ్ముతున్న పదేళ్ల కుర్రాడికి ఆనంద్ మహేంద్ర సపోర్ట్ గా నిలిచారు. ఢిల్లీలో జస్ప్రిత్ అనే 10ఏళ్ల కుర్రాడు రోటీలు చేసి అమ్ముకుంటున్న వీడియో వైరలవుతోంది. బ్రెయిన్ టీబీ వల్ల తండ్రి చనిపోవడంతో ఆ బాధ్యతలను ఈ పసివాడు అందుకున్నాడట. ఇతనికి ఓ అక్క కూడా ఉంది. తల్లి తమను వదిలేసి వెళ్లిపోవడంతో ఉదయం స్కూల్ కి వెళ్లి సాయంత్రం ఇలా ఫుడ్ బిజినెస్ చూసుకుంటాడట. ఈ వీడియో చూసి ఆనంద్ మహీంద్రా చలించిపోయారు.

సంబంధిత పోస్ట్