సిక్కులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘తన వ్యాఖ్యలపై బీజేపీ అబద్దాలను ప్రచారం చేస్తోంది. నేను మాట్లాడిన వాటిలో ఏదైనా తప్పుందేమో సిక్కు సోదర, సోదరీమణులు చెప్పాలి. భారత్‌లో ఎవరైనా వారి మతాలను స్వేచ్ఛగా అనుసరించొచ్చు కదా?. బీజేపీ నిజం వైపు ఉండదు. అందుకే నా నోరు మూయాలని చూస్తోంది’ అని ట్వీట్ చేశారు.