హైదరాబాద్‌లో చంద్రబాబుకు ఘన స్వాగతం

77చూసినవారు
హైదరాబాద్‌లో చంద్రబాబుకు ఘన స్వాగతం
హైదరాబాద్‌లో ఏపీ సీఎం చంద్రబాబుకు TDP శ్రేణుల నుంచి ఘనస్వాగతం లభించింది. ఢిల్లీ పర్యటన ముగించుకుని బేగంపేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ఆయనకు టీటీడీపీ నేతలు, కార్యకర్తలు స్వాగతం పలికారు. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన అనంతరం చంద్రబాబు తొలిసారి హైదరాబాద్‌కు వచ్చిన నేపథ్యంలో పార్టీ నేతలు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌లోని చంద్రబాబు నివాసం వరకు ర్యాలీ నిర్వహించనున్నారు.

సంబంధిత పోస్ట్