ప్రముఖ మొబైల్ సంస్థ ‘OPPO’ మరో కొత్త 5G ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఎఫ్ సిరీస్‌లో భాగంగా ‘OPPO F27 PRO+ PLUS 5G స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. దేశీయ తొలి వాటర్ ప్రూఫ్ ఫోన్ ఇదేనని ఆ కంపెనీ పేర్కొంటోంది. వేరియంట్ ధర రూ.27,999, రూ.29,999గా ఉంది. జూన్ 20 నుంచి ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఒప్పో ఆన్‌లైన్ స్టోర్లలో లభించనున్నాయి.