ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను రద్దు చేస్తూ సీఎం చంద్రబాబు నాయుడు సంతకం చేశారు. ప్రజల స్థిరాస్తులను కొట్టేయడానికి గత ప్రభుత్వం అత్యంత దుర్మార్గమైన ఈ చట్టాన్ని 2023 అక్టోబర్ 31న తీసుకొచ్చిందని కూటమి పార్టీలు ఆరోపించాయి. ఈ చట్టం ముసుగులో ప్రభుత్వ, ప్రైవేట్ వ్యక్తుల భూ భక్షణకు ఆస్కారం ఇచ్చేలా వేర్వేరు సెక్షన్లు రూపొందించారని మండిపడ్డారు. తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.