ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాలో ఇటీవల షాకింగ్ ఘటన జరిగింది. ఓ మహిళ పెళ్లైన 40 రోజులకే విడాకులు కోరింది. భర్త నెలకు 1 లేదా 2 రోజులు మాత్రమే స్నానం చేస్తున్నాడని, శరీరం నుంచి వచ్చే దుర్వాసనను భరించలేకపోతున్నానని, పెళ్లైనప్పటి నుంచి 6 సార్లు మాత్రమే స్నానం చేశాడని, వారానికోసారి గంగాజలం చల్లుకుంటాడని ఆగ్రాలోని ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించింది. దీంతో ఈ నెల 22న కౌన్సెలింగ్ సెంటర్ కు రావాలని భార్యాభర్తలిద్దరికీ అధికారులు సూచించారు.