ఒకే కుటుంబంలో ఐదుగురిని చంపి యువకుడు ఆత్మహత్య!

41705చూసినవారు
ఒకే కుటుంబంలో ఐదుగురిని చంపి యువకుడు ఆత్మహత్య!
ఛత్తీస్‌గఢ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని కిరాతకంగా హత్యచేసిన ఓ వ్యక్తి తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బలోదాబజార్ జిల్లాలో చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు భయంకరంగా పడి ఉన్న మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకేసారి ఐదుగురిని హత్య చేయడానికి గల కారణాలు ఏంటనే దానిపై ఆరా తీస్తున్నారు. వ్యక్తిగత కారణాలే కారణమని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్