బెంగుళూరులోని టాయిలెట్ డస్ట్‌బిన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టిన థర్డ్ వేవ్ ఉద్యోగి అరెస్టు

75చూసినవారు
బెంగుళూరులోని టాయిలెట్ డస్ట్‌బిన్‌లో సీక్రెట్ కెమెరా పెట్టిన థర్డ్ వేవ్ ఉద్యోగి అరెస్టు
బెంగళూరులోని థర్డ్ వేవ్ కాఫీ షాపులోని టాయిలెట్ డస్ట్‌బిన్‌లో ఓ మహిళ రహస్య కెమెరాను గుర్తించి సోషల్ మీడియా వేదికగా తెలిపింది. ఈ విషయాన్ని నెటిజన్లు వైరల్ చేయడంతో బెంగళూరు పోలీసులు దర్యాప్తు చేపట్టి.. అదే షాపులో ఉద్యోగం చేస్తున్న 23 ఏళ్ళ యువకుడిని అరెస్టు చేశారు. నిందితుడిని మనోజ్‌గా గుర్తించారు. "సుమారు 2 గంటల పాటు వీడియో రికార్డింగ్ ఆన్" ఉన్న కెమెరాను ఒక మహిళ కనుగొన్నట్లు ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ తెలిపింది. ఎలాంటి శబ్దం రాకుండా ఉండేందుకు ఫోన్ ఫ్లైట్ మోడ్‌లో ఉందని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్