బైక్ పై ప్రమాదకర స్టంట్స్ చేసిన యువకుడు.. వీడియో వైరల్

76చూసినవారు
సోషల్ మీడియాలో ఎలాగైనా పాపులర్ కావాలని కొంత మంది యువకులు ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రమాదకర స్టంట్స్ చేస్తున్నారు. తాజాగా ఇదే కోవలో ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఓ యువకుడు రద్దీ ప్రదేశంలో బైక్ పై స్టంట్స్ చేశాడు. రోడ్డుపై బైక్ నడుపుతూ దానిపై నిల్చొని వాహనాన్ని పోనిచ్చాడు. దీనిని మరో వ్యక్తి వీడియో తీశాడు. ఈ ఘటన ఎక్కడ, ఎప్పుడు జరిగిందో స్పష్టత లేదు. ఇలాంటి ప్రమాదకర స్టంట్స్ చేయొద్దని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్