వరద ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఓ యువకుడిని ప్రాణాలకు తెగించి కాపాడారు. ఈ ఘటన హరిద్వార్ లో జరిగింది. హరిద్వార్‌లో గంగాస్నానం చేస్తుండగా ఓ శివ భక్తుడు ప్రమాదవశాత్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఇది గమనించిన SDRF సిబ్బంది క్షణాల్లోనే ప్రవాహంలోకి దుకారు. ప్రవాహానికి ఎదురెళ్లి శివ భక్తుడిని రక్షించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.