’ఊరి పేరు భైరవకోన‘ డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్న ’ఆహా‘!

57చూసినవారు
’ఊరి పేరు భైరవకోన‘ డిజిటల్ రైట్స్‌ను దక్కించుకున్న ’ఆహా‘!
టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ‘ఊరి పేరు భైరవకోన’. వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఫిబ్రవరి 16 వ తేదీన థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ కానుంది. హీరో సందీప్ కిషన్ సరసన వర్ష బొల్లమ్మ నటించగా, కావ్య థాపర్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్యపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను తాజాగా ఆహా వీడియో దక్కించుకున్నట్లు సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్