అద్దె చెల్లించకపోవడంతో ఆప్ ఆఫీస్‌కు తాళం (VIDEO)

79చూసినవారు
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఉన్న ఆమ్‌ఆద్మీ పార్టీ ఆఫీస్‌కు తాళం పడింది. లీజుకు తీసుకున్న ఇంట్లో నడుస్తున్న ఆప్ కార్యాలయానికి మూడు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో ఇంటి యజమాని తాళం వేశారు. దీనిపై ఆప్ జాయింట్ సెక్రటరీ రమాకాంత్ పటేల్ స్పందించారు. ‘మనం నిజాయితీగా పనిచేసినప్పుడే ఇదంతా జరుగుతుంది. ప్రస్తుతం మా పార్టీ వద్ద నిధులులేవు’ అని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్