ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ప్రారంభమైంది. దీపం 2.0లో భాగంగా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం మండలం ఈదుపురంలో సీఎం చంద్రబాబు దీన్ని ప్రారంభించారు. మహిళా లబ్ధిదారు ఇంటికి వెళ్లి ఉచిత గ్యాస్ సిలిండర్ అందజేశారు. అనంతరం స్వయంగా స్టవ్ వెలిగించి టీ చేసి తాగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.