యాలకులు శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు, టెర్పెనెస్, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీ ఇన్ఫ్లమేటరీ కాంపౌండ్స్‌ను కలిగి ఉంటాయి. రోజూ రెండు యాలకులు తింటే అద్భుత ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరంలో వాపును తగ్గిస్తాయి. అలాగే జీర్ణవ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతాయి. ఎసిడిటీ, గ్యాస్, ఉబ్బరాన్ని తగ్గిస్తాయి. యాలకులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రక్తపోటును నియంత్రిస్తాయి. వీటిని తినడం వల్ల డిప్రెషన్ తగ్గుతుంది.