AP: అల్లూరి జిల్లాలో విషాదకరమైన ఘటన చోటుచేసుకుంది. డుండ్రిగూడ మండలం జోడిగూడ తండాకు చెందిన ఊర్మిళ కట్టెలు తెచ్చేందుకు తన రెండేళ్ల కూతురితో కలిసి గురువారం కొండపైకి వెళ్లింది. కట్టెలు ఏరుతుండగా చిన్నారి గీతాంజలిపై ఒక్కసారిగా కందిరీగలు దాడి చేయగా.. కాపాడబోయిన తల్లిపై కూడా దాడి చేశాయి. గమనించిన స్థానికులు హుటాహుటీని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఇద్దరూ మరణించారు. దీంతో ఆ తండాలో విషాదం నెలకొంది.