బీమాకు సంబంధించి జీఎస్టీ తొలగించాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కోరారు. ఈ మేరకు తాజాగా లేఖ రాశారు. జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియంలపై చెల్లించే జీఎస్టీ తొలగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. నాగ్‌పుర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉద్యోగుల సంఘం అభ్యర్థన మేరకు ఈ లేఖ పంపినట్లు ఆయన తెలిపారు. కాగా, వాటిపై 18 శాతం జీఎస్టీ ఉందని వివరించారు.