నిందితులను 6 నెలల్లోగా శిక్షించేలా చట్టం: డిప్యూటీ సీఎం

76చూసినవారు
నిందితులను 6 నెలల్లోగా శిక్షించేలా చట్టం: డిప్యూటీ సీఎం
నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌పై బిహార్‌ డిప్యూటీ సీఎం సామ్రాట్‌ చౌధరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనపై కఠిన చర్యలు చేపడతామని, భారత ప్రభుత్వం కూడా చట్టంలో ఓ నిబంధన తీసుకొచ్చిందని చెప్పారు. ప్రశ్నాపత్రాల లీకేజ్‌ బాధ్యులకు పదేండ్ల శిక్ష, జరిమానా విధిస్తారని తెలిపారు. దీనిపై తాము కూడా తదుపరి శాసనసభా సమావేశాల్లో చట్టాన్ని తీసుకొస్తామని వెల్లడించారు. నిందితులపై కఠిన చర్యలు చేపట్టడం, నిందితులను 3 నుంచి 6 నెలల్లోనే శిక్షించేలా చట్టాన్ని తీసుకొస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్