నటుడు సైఫ్ అలీఖాన్ కు కాస్మొటిక్, న్యూరో సర్జరీలు ముగిశాయి. ఆయనకు ప్రాణాపాయం తప్పిందని లీలావతీ ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారని, డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారని పేర్కొన్నాయి. ఆపరేషన్లు ముగిశాక అతడి భార్య కరీనా కపూర్ సహా కుటుంబ సభ్యులు డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. సైఫ్ ను దుండగుడు 6 సార్లు కత్తితో పొడిచాడు. దాంతో అతడి మెడవద్ద లోతైన గాయం అయినట్లు సమాచారం.