రోడ్డు ప్రమాదంలో నటికి గాయాలు

542చూసినవారు
రోడ్డు ప్రమాదంలో నటికి గాయాలు
'వాంపైర్ డైరీస్' నటి నినా డోబ్రేవ్‌ ఆసుపత్రి పాలైంది. రోడ్డు ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. తాను ఆసుపత్రిలో ఉన్న ఫొటోను ఆమె స్వయంగా మంగళవారం పోస్ట్ చేసింది. అందులో ఆమె పలు గాయాలతో ఆసుపత్రి బెడ్‌పై కనిపించింది. ప్రమాదం గురించి ఇతర వివరాలను ఆమె వెల్లడించలేదు. తాను బాగానే ఉన్నానని, కోలుకుంటున్నానని పేర్కొంది. ఆమె త్వరగా కోలుకోవాలని నటీనటులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్