నటి నియాశర్మకు షూటింగ్‌లో తప్పిన ప్రమాదం (వీడియో)

77చూసినవారు
ప్రముఖ టీవీ నటి నియాశర్మకు షూటింగ్‌లో ప్రమాదం తప్పింది. ముంబైలో గురువారం 'సుహాగన్ చుడైల్' అనే టీవీ షో షూటింగ్‌‌లో ఆమె పాల్గొంది. చుట్టూ కాగడాలు పట్టుకుని కొందరు నటులు ఆమె చుట్టూ తిరిగారు. వారి నుంచి తప్పించుకుని వచ్చే క్రమంలో అకస్మాత్తుగా మంటలు ఎగసి పడ్డాయి. ఆ మంటలు నియాశర్మ ముఖానికి తాకాయి. దీంతో ఆమె కింద పడిపోయింది. అయితే తాను క్షేమంగానే ఉన్నట్లు ఆమె పేర్కొంది. నాగిని-4 ద్వారా ఆమె ఫేమస్ అయింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్