భారీ నష్టాల్లోకి అదానీ గ్రూప్ షేర్లు

83చూసినవారు
భారీ నష్టాల్లోకి అదానీ గ్రూప్ షేర్లు
ఎగ్జిట్ పోల్స్ అంచనాల కంటే భిన్నంగా ఫలితాలు ఉండటంతో స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూస్తున్నాయి. ఈ క్రమంలో అదానీ గ్రూప్ స్టాక్స్ భారీగా కుప్పకూలాయి. ఓ దశలో అదానీ పోర్ట్స్ షేర్లు ఏకంగా 20 శాతం క్షీణించగా.. అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 19.80%, అదానీ పవన్ షేర్లు 19.76%, అంబుజా సిమెంట్స్ 19.20%, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు 19.13%, అదానీ టోటల్ గ్యాస్ 18.55%, అదానీ గ్రీన్ ఎనర్జీ 18.31%, ఎన్‌డీటీవీ 15.65%, ఏసీసీ 14.49%, అదానీ విల్మర్ 9.81% చొప్పున నష్టపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్