108 అంబులెన్స్ లో గర్భిణి డెలివరీ

50చూసినవారు
108 అంబులెన్స్ లో గర్భిణి డెలివరీ
పురిటి నొప్పులు అధికమవ్వడంతో ఓ గర్భిణీ స్త్రీ 108 వాహనం లోనే ప్రసవించిన అయిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. గాదిగూడ మండలం మేడిగూడ గ్రామానికి చెందిన సంద్యకు పురిటినొప్పులు రావడంతో 108 సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ఘటన స్థలానికి వెళ్లిన వాహన ఈఎంటీ పి. సాయి తేజ, పైలెట్ ప్రవీణ్ లు గర్భిణీ స్త్రీని రిమ్స్ కు తరలిస్తుండగా మార్గమధ్యలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ ఇద్దరు సురక్షితంగా ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్