ఆదిలాబాద్: భక్తిశ్రద్ధలతో కామ దహన కార్యక్రమం

66చూసినవారు
ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కామ దహనం కార్యక్రమాన్ని ప్రజలు గురువారం రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా పట్టణంలోని అతి పురాతనమైన శ్రీ గోపాలకృష్ణ మఠం వద్ద ఏర్పాటుచేసిన కామ దహన కార్యక్రమం వైభవంగా సాగింది. ముందుగా మఠాధిపతి యోగానంద సరస్వతి ఆధ్వర్యంలో సాంప్రదాయ పూజలు నిర్వహించారు. భక్తులు కామ దహనం చుట్టూ ప్రదర్శనలు నిర్వహించారు. అనంతరం కామ దహనం యొక్క ప్రాముఖ్యతను మఠాధిపతి వివరించారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్