బర్మింగ్‌హామ్‌లో గురువారం జరిగిన ఆల్ ఇంగ్లాండ్ ఓపెన్ 2025 రెండవ రౌండ్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ లక్ష్యసేన్ ముందడుగు వేశాడు. డిఫెండింగ్ ఛాంపియన్, ప్రపంచ నంబర్ 2 ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీని ఓడించాడు. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో 21-13, 21-10 తేడాతో వరుస గేమ్‌లలో లక్ష్యసేన్ విజయం సాధించాడు. కేవలం 36 నిమిషాలలో ప్రత్యర్థిని మట్టికరిపించాడు. తద్వారా క్వార్టర్ ఫైనల్ చేరాడు.