కరెంట్ షాక్‌తో స్తంభంపైనే యువకుడు మృతి (వీడియో)

85చూసినవారు
యూపీలోని కాన్పూర్‌లో గురువారం విషాద ఘటన జరిగింది. హోలీ సందర్భంగా లైటింగ్ పెట్టేందుకు రాజేంద్ర (32) అనే యువకుడు స్తంభం ఎక్కాడు. దురదృష్టవశాత్తూ హైటెన్షన్ వైర్లు తగలడంతో కరెంట్ షాక్ కొట్టింది. దీంతో స్తంభం నుంచి కింద పడ్డాడు. స్థానికులు హుటాహుటిన రాజేంద్రను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్