ఆదిలాబాద్: సైబర్ నేరగాళ్ల వలలో ప్రైవేటు ఉద్యోగి

51చూసినవారు
ఆదిలాబాద్: సైబర్ నేరగాళ్ల వలలో ప్రైవేటు ఉద్యోగి
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి ప్రైవేటు ఉద్యోగి రూ. 9. 80లక్షలు పోగొట్టుకున్న ఘటన ఆదిలాబాద్ లో చోటుచేసుకుంది. వన్ టౌన్ సీఐ సునిల్ వివరాల మేరకు. ప్రైవేటు ఉద్యోగికి ఆన్లైన్లో పనిచేస్తే ప్రతి రోజు వేలు సంపాదించవచ్చని ఈ నెల 5న టెలిగ్రాంలో మెసేజ్ కు ఆకర్షితుడై డబ్బులు జమ చేశాడు. అనంతరం మెసేజ్లు రావటం ఆగిపోవడంతో మోసపోయానని గమనించాడు. దీంతో వన్ టౌన్ లో గురువారం ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్