గురుకృప దినోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు

187చూసినవారు
గురుకృప దినోత్సవంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు
ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం కొత్తపల్లి గ్రామంలో 42వ గురుకృప దినోత్సవం సంధర్బంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆదిలాబాద్ జడ్పీ చెర్మెన్ జనార్ధన్ రాథోడ్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ లు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చెర్మెన్ మాట్లాడుతూ.. మంత్రి ఐ.కె రెడ్డి సహకారంతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి దీక్ష భూమి అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. అటు దీక్ష గురువు ప్రేమ్ సింగ్ మహరాజ్ జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గుడిహత్నూర్ ఎంపీపీ పుండలిక్, మండల అధ్యక్షుడు కరాడ్ బ్రాహ్మనంద్, నార్నూర్ సిఐ రమణ మూర్తి, ఎస్సై విజయ్, ఆదిలాబాద్ జేఏసీ నాయకుడు అనిల్ రాథోడ్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్