సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) మధ్య ఐపీఎల్ టికెట్ల వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జట్టుతో చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ వర్గాలు తెలిపాయి. 'మాకు కేటాయించిన వాటికి మించి అదనపు పాసులను ఎప్పుడూ అడగలేదు. అసోసియేషన్ పరువుకు భంగం కలిగించే పద్దతి మంచిది కాదు' అని పేర్కొన్నారు.