టీపీసీసీ మీడియా, కమ్యూనికేషన్ సమన్వయకర్తగా ఆదిలాబాద్ జిల్లా మావల మండలం వాఘాపూర్ కు చెందిన డీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భూపెల్లి శ్రీధర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు సామ రామ్మోహన్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో మీడియా సమన్వయకర్తగా నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు.