మావల: ప్రభుత్వ పాఠశాలలో చోరీ

63చూసినవారు
మావల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. పాఠశాల హెచ్ఎం విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం పాఠశాలకు చేరుకోగా పాఠశాలలో దొంగతనం అయినట్లు గుర్తించామని పేర్కొన్నారు. వెంటనే మావల పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. పాఠశాలలో 12 ఫ్యాన్లు, ట్యూబ్లైట్లు, మధ్యాహ్న భోజన పథకం కు సంబంధించిన వస్తువులు, బియ్యం చోరీకి గురైందన్నారు. ఎస్సై విష్ణు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత పోస్ట్