ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య

76చూసినవారు
ఆర్థిక ఇబ్బందులతో మహిళ ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జైనూర్ ఎస్సై సాగర్ తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని వేకర్ సెక్షన్ కు చెందిన పల్లపు లక్ష్మీ (41)కు ముగ్గురు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. 2020 సంవత్సరంలో కూతురు పెళ్లికి తీసుకున్న అప్పును ఎలా తీర్చాలో బాధతో ఆదివారం రాత్రి ఇంట్లో దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సోమవారం కుటుంబ సభ్యులు గమనించి జైనూర్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై సాగర్ మృతదేహాన్ని పరిశిలించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్