గంజాయి సాగు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు
సాగు చేస్తున్న గంజాయిని పట్టుకొని కేసు నమోదు చేసినట్లు బజార్హత్నూర్ ఎస్ఐ అప్పారావు తెలిపారు. బజార్హత్నూర్ మండలంలోని చిన్నుమియా తండాకు చెందిన ధంగర్ రాజు తన పత్తి పంటలో గంజాయి సాగు చేస్తున్నట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా 65 మొక్కలను స్వాధీనం చేసుకొని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.