చాలా మందిలో అడ్రినల్ గ్రంథి సరిగా పనిచేయకపోవటం వల్ల రక్తపోటు పడిపోవటానికి అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే శరీరంలో సోడియం, పొటాషియం వంటి ఖనిజ లవణాల మోతాదులు తగ్గినా బీపీ పడిపోతుందంటున్నారు. కొందరిలో స్వయం చాలిత నాడీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడం వల్ల పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు సాధారణంగా ఉన్న రక్తపోటు వారు లేచి నిలుచున్నప్పుడు ఒక్కసారిగా పడిపోతుందని వైద్యులు తెలిపారు.