తాంసి మండలంలోని కప్పర్ల ప్రాథమిక పాఠశాలలో రూమ్ టూ రీడ్ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన మోడల్ లైబ్రరీని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. మోడల్ లైబ్రరీని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పుస్తక పటణం ద్వార అపారమైన జ్ఞానం వస్తుందని, ఆ దిశగా ప్రతి రోజు పుస్తకాలు చదివేందుకు కొంత సమయం కేటాయించాలన్నారు.