బోథ్ మండలంలో చిరుతపులి సంచరిస్తుందని గ్రామస్తులు తెలిపారు. మండలంలోని బాబెరాతాండలో గురువారం అర్ధరాత్రి మేకల మందపై చిరుత పులి దాడి చేసి నాలుగు మేకలను చంపేసింది. మేకల అరుపులకు గ్రామస్తులు మేల్కొనగా ఆ అలికిడితో చిరుతపులి పారిపోయింది. చిరుతపులి సంచారంతో భయభ్రాంతులకు గురవుతున్నామని గ్రామస్తులు తెలిపారు.