ఇచ్చోడా మండలంలో బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రోడ్డు నిర్మాణంలో భాగంగా ఉపయోగించే కంకరను సుంకిడి నుంచి ఇచ్చోడా వైపు తరలిస్తున్న తిరుమల కన్స్ట్రక్షన్ కు చెందిన టిప్పర్ వాహనం ఇచ్చోడా మండలం గాంధీనగర్ వద్ద జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కోవడంతో కాలుకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ ను రిమ్స్ ఆసుపత్రి తరలించారు.