అక్రమ అరెస్టులకు భయపడేది లేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పరామర్శించడానికి హైదరాబాద్ కు వెళ్తున్న బోథ్ ఎమ్మెల్యేను శుక్రవారం పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పట్టపగలే బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేసినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. తనను హౌస్ అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు.