తలమడుగు మండలంలోని కప్పర్‌దేవి, డోర్లి, పున్నగూడ గ్రామాల రైతులు తమ పంట పొలాలకు త్రీ ఫేస్ విద్యుత్ సరఫరా ఉండడం లేదని మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ ఎదుట బుధవారం ధర్నా చేశారు. వాహనాలను అడ్డుగా పెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతు కాంతారావు మాట్లాడుతూ. గత ఖరీప్ సీజన్ లో అకాల వర్షలకు త్రీఫేస్ స్తంభాలు, ట్రాన్స్‌ఫర్లు దెబ్బతిన్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్య పరిష్కరించాలని అన్నారు.