తలమడుగు: యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం

60చూసినవారు
యోగా ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని యోగ ట్రైనర్ సాయి కుమార్ అన్నారు. తలమడుగు మండలంలోని కుచులాపూర్ గ్రామంలో ఆయుష్మాన్ భారత్ కార్యక్రమంలో భాగంగా యోగ శిక్షణ కేంద్రాన్ని గ్రామస్తులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా యోగాసనాలు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను గ్రామస్తులకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో యోగా క్లాసులు నిర్వహించేందుకు ప్రత్యేకంగా యోగా శిక్షకులను నియమించిందని తెలిపారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్