బోథ్: అర్హులందరికీ ఇళ్లను కేటాయించాలి
బోథ్ మండల కేంద్రంలో ధర్మ సమాజ పార్టీ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షులు గణేశ్ మహారాజ్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మెజారిటీ ప్రజలైనటువంటి 90% బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్యా వైద్యం అందించాలన్నారు. అర్హులందరికీ భూమి ఇల్లు, ఉపాధిని కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లా ప్రచార కమిటి సభ్యులు వెంకటేష్, బోథ్ మండల అధ్యక్షులు గణేశ్, ఉన్నారు.