వాంకిడి: ఫుడ్ పాయిజన్ విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలి
గత నెల 29న వాంకిడి మండలం ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించాలని భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే డిమాండ్ చేశారు. చౌదరి శైలజ నిరుపేద కుటుంబానికి చెందిన విద్యార్థిని కావున ప్రభుత్వం ఆమె ఆరోగ్యంపై చర్యలు చేపట్టాలని కోరారు. ఆశ్రమ పాఠశాలలో పర్యవేక్షణను పెంచి విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలన్నారు.