గుడిహత్నూర్ విద్యారణ్య ఆవాస విద్యాలయంలో నిర్మిస్తున్న పాఠశాల అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని జిల్లా బీజేపీ అధ్యక్షులు పతంగె బ్రహ్మానంద్ అన్నారు. శనివారం గుడిహత్నూర్ మండలంలోని మన్నూర్ గ్రామంలోని జెడ్పిఎస్ఎస్ పాఠశాలలో అయన పరిశీలించారు. ఈ సందర్బంగా పాఠశాలలో అందుతున్న విద్య, మధ్యాహ్న భోజనం గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.