కోటపల్లి మండలంలోని రాజారం పంచాయతీలోని కావర్ కొత్తపల్లి గ్రామంలో పారిశుద్ధ్యం లోపించి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువల్లో చెత్తా చెదారం పేరుకుపోయి మురుగునీరు రోడ్లపైనే పారుతోంది. దీంతో దోమలు వృద్ధి చెంది రోగాల బారిన పడాల్సి వస్తోందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి కాలువలోని చెత్తచెదారాన్ని తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.