దస్తురాబాద్ మండల కేంద్రంలోని రేవోజిపేట ప్రభుత్వ పాఠశాలకు సరిగ్గా రాకుండా నిధులు నిర్వహిస్తున్న హెచ్ఎం డి.సురేఖ మాకు వద్దు అని గ్రామస్తులు, తల్లిదండ్రులు తెలపారు. పాఠశాలకు తాళం వేశారు. జూన్ 29 తరువాత బుధవారం పాఠశాలకు వచ్చారని తెలిపారు. విషయం తెలుసుకున్న తహశీల్దార్ లక్ష్మీ పాఠశాల వద్దకు వచ్చి పొరపాటు జరిగిందని, డిఇఒతో మాట్లాడి వారం రోజుల్లో మరో టీచర్ ను పాఠశాలకు వేయిస్తామని అనడంతో వారు శాంతించారు.