ఖానాపూర్: తాటి చెట్టు పైనుంచి పడిన వ్యక్తికి తీవ్ర గాయాలు
తాటి చెట్టు పై నుంచి పడి గీత కార్మికుడు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం ఖానాపూర్ మండలంలో చోటుచేసుకుంది. సత్తెనపల్లి గ్రామానికి చెందిన శేఖర్ గౌడ్ కల్లు గీయడం కోసం తాటి చెట్టు ఎక్కుతున్న క్రమంలో కాలు జారి అదుపుతప్పి కింద పడినట్లు స్థానికులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే నిర్మల్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.