లక్షేటిపేట మండల కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తా సమీపంలో ఓ భవనంలో నిర్వహిస్తున్న పేకాట స్ధావరంపై పోలీసులు, టాస్క్ ఫోర్స్ సిబ్బంది ఆధ్వర్యంలో దాడి నిర్వహించారు. ఈ దాడిలో 11 మందిని అదుపులో తీసుకొని వారి వద్ద నుంచి 30 వేల 970 నగదుతో పాటు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.