షెడ్యూల్ తెగల ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెడతామని కలెక్టర్ కుమార్ దీపక్ సోమవారం అన్నారు. మంచిర్యాల కలెక్టరేట్ లో జెడ్పి సీఈవో, ఇతర అధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు. జిల్లాలోని షెడ్యూల్డ్ తెగల ప్రాంతాల్లో నిర్వహించే అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాల అమలు పై ప్రతిపాదనలు రూపొందించి నివేదిక అందించాలని ఆదేశించారు. పల్లెల్లోని విద్యుత్ సమస్యల పరిష్కారం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు.